ప్రతినెలా మంత్రులు రిపోర్టు చేయాల్సిందే: నవీన్‌

Ministers To Submit Monthly Report Cards Of Work Naveen patnaik Orders - Sakshi

భువనేశ్వర్‌: ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతినెల అమలు చేసిన పథకాల గురించి తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రతినెల ఏడు తేదీన మంత్రులందరూ రిపోర్టు పత్రాలను సీఎంవో కార్యాలయానికి పంపాలన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు దిశానిర్ధేశం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు (మేనిఫెస్టో)ను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎ​న్నికల్లో నవీన్‌ నేతృత్వంలోని బీజూజనతాదళ్‌ అద్బుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .రాష్ట్రంలోని 142 స్థానాలకు గాను 112 స్థానాలను గెలుపొంది.. వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయంలో ఆయనకెంతో దోహదం చేసిన సంక్షేమ పథకాలను పకడ్భందీగా అమలుచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను నవీన్‌ ఆదేశించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top