జనసేన టెంపరరీ పార్టీ...! | Minister Adinarayanareddy fires on Janasena | Sakshi
Sakshi News home page

Mar 28 2018 8:04 PM | Updated on Mar 22 2019 5:33 PM

Minister Adinarayanareddy fires on Janasena - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌పైనా మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ఓ తాత్కాలిక పార్టీ అని, పవన్‌కళ్యాన్‌ ఓ కాలం చెల్లిన రాజకీయ నాయకుడని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ గంటకోరకంగా మాట్లాడుతున్న జనసేన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో అత్యంత బలహీనమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని మరో మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. దేశ పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు 13 సార్లు విశ్వాస తీర్మానం, 26సార్లు అవిశ్వాస తీర్మానాలపై చర్చలు జరిగితే ఇప్పుడు బీజేపీ మాత్రం అవిశ్వాసంపై చర్చ అంటేనే పారిపోతోందన్నారు. పార్లమెంటులో టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే సభ్యులను అడ్డు పెట్టుకొని అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ అడ్డుకుంటోందని మంత్రి జవహర్‌ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అహంకారం పెరిగిపోయిందని, బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement