‘మోదీ, కేసీఆర్‌ ప్రజా విశ్వాసం కోల్పోయారు’

Mallikarjun Fires On KCR And Narendra Modi - Sakshi

మోదీ బీ టీమ్‌గా అన్ని నిర్ణయాలకూ టీఆర్‌ఎస్‌ మద్దతు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే 

సాక్షి, హైదరాబాద్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. బూటకపు వాగ్దానాలతో కడుపు నిండదని, తిరిగి ఆయా పక్షాలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండు ఒక్కటేఅని, మోదీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు మద్దతిస్తూ వచ్చిందని దుయ్యబట్టారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అన్నిబిల్లులకూ కేసీఆర్‌ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్రంలోని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తూ వస్తోందని ఖర్గే దుయ్యబట్టారు. 

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే..
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బీజేపీ వెంట నడుస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకోసం ఎంద రో యువకులు ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌ను శత్రువుగా చూస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ చెడ్డదైందా, కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే త్యాగాలు చేసిందా? అని ప్ర శ్నించారు. సెక్యులర్‌ అని చెప్పుకునే కేసీఆర్‌ ఎంఐఎంతో కలిసి బీజేపీకి మద్దతు పలుకుతున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top