ఎన్నికలకు ముందు సర్వే వివరాలు: లగడపాటి

Lagadapati Rajagopal To Release Survey Details Before Elections - Sakshi

సాక్షి, పెనుకొండ రూరల్‌: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top