సిద్దూకు ఆహ్వానం: కేజ్రీవాల్

Kejriwal Says Sidhu Welcome To Join AAP Amid Buzz Around Him - Sakshi

ఢిల్లీ : పంజాబ్ మాజీ మంత్రి న‌వ‌జ్యోత్‌ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. గ‌త కొంత కాలంగా ఆయ‌న పార్టీని వీడ‌తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికోసం ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తాజాగా ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ అర‌వింద్ కేజ్రివాల్.. సిద్దూ రావాల‌నుకుంటే తమ పార్టీ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతుంది అన‌డంతో ఈ విష‌యంపై స్పష్టత వ‌చ్చిన‌ట్టయింది. గురువారం జ‌రిగిన ఓ స‌మావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆప్‌ తరపున సిద్దూతో ఎవరైనా చర్చలు జరుపుతున్నారా అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.

2017లో బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సిద్దూ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఈ త‌ర్వాత ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌తో వ‌చ్చిన విబేధాల కార‌ణంగా పార్టీ స‌మావేశాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ఏడాది క్రిత‌మే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయనను ఆహ్వానించింది. అయితే కొన్ని సామాజిక ప‌రిస్థితుల కార‌ణంగా అప్పుడు చేర‌లేదు. ఈ ఏడాది మార్చిలో ఆమ్ ఆద్మీ పంజాబ్ ఛీప్ భగవంత్ మన్ కూడా సిద్దూని తమ పార్టీలోకి ఆహ్వానించారు. (గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ)

అప్ప‌టి ఎన్నిక‌ల్లో సిద్దూ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తుతం పార్టీ మారే విష‌యంలోనూ కీల‌కంగా మారినట్టు కనబడుతోంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఐడి), బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 117 స్థానాల్లో 77 సీట్లు గెలిచి అమ‌రీంద‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. (కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top