‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్

సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం అని, ఆయనకు రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణపై ప్రేమ లేదని మరోమారు నిరూపించుకున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, విప్ కర్నె ప్రభాకర్ విమ ర్శించారు. ఆదివారం ఆయన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి వైఖరిని ఖండించారు. మెట్రో రైలుకు రూ.1,200 కోట్ల కేటాయింపు కేంద్రంతో కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని, అందులో కిషన్‌రెడ్డి మెహర్బానీ ఏమీ లేదని ప్రభాకర్ స్పష్టంచేశారు. మెట్రో ప్రారంభానికి సంబంధించిన ప్రతీ ప్రకటనలోనూ ప్రధాని మోదీ ఫొటోను వేయడాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం నుంచి తెలంగాణకు ఏదైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే పౌర సన్మానం చేస్తామని ప్రభాకర్ ప్రకటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి