గవర్నర్‌ తలదించుకునేల చేశారు : జీవన్ రెడ్డి

Jeevan Reddy Criticize On BJP - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్‌  తలదించుకునే పని  చేశారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి  ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ రాజకీయాలను నిరసిస్తూ కాంగ్సెస్‌ పార్టీ హుజురాబాద్ లో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ పొన్నాల ప్రభాకర్‌, వి. హన్మంతరావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్నారు.

ప్రధాన మంత్రి మోదీకి నిజంగా నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఇప్పుడు కర్ణాటక విషయంపై  ఎందుకు నోరు మెదపడం లేదని ఆరోపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top