వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు

Indukuri Raghu Raju Joins YSRCP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా ఈ రోజు వైఎస్సార్‌ సీపీలో చేరారు.

సైనికుల్లా పనిచేస్తాం..
వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం సృష్టిస్తారని రఘురాజు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌ సీపీ కైవశం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాజన్న ఆశయ సాధన కోసం జగన్‌ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ఆయన కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ వల్లే సాధ్యమన్నారు. బేషరతుగా వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎస్‌ కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు.


మన మద్దతుదారులతో రఘురాజు బైకు ర్యాలీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top