సంపత్‌ను చేర్చుకోవాల్సిన అవసరం లేదు | guvvala bala raj on sampath | Sakshi
Sakshi News home page

సంపత్‌ను చేర్చుకోవాల్సిన అవసరం లేదు

Jan 11 2018 2:43 AM | Updated on Jan 11 2018 2:43 AM

guvvala bala raj on sampath - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని టీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజు అన్నారు. మంత్రి హరీశ్‌రావుపై సంపత్‌ వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆర్డీఎస్‌పై సంపత్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని లీకులు ఇవ్వాల్సిన అవసరం హరీశ్‌కు లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్‌కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్‌ పథకం శంకుస్థాపన నడిగడ్డ ప్రజల కళ్ళలో కొత్త కాంతులు నింపిందన్నారు. కేసీఆర్‌ పాదయాత్ర వల్లే తుమ్మిళ్ల లిఫ్టు రూపుదిద్దుకుందన్నారు. ఇకనైనా రేవంత్, సంపత్‌లు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement