టీడీపీకి అన్నపూర్ణమ్మ రాజీనామా

Former MLA Aleti Annapurna Resign To TDP - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శనివారం రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో ప్రకటించారు. అలాగే ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో ఆమె కుమారుడు మల్లికార్జున్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్‌లో జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేతగా పేరొందిన అన్నపూర్ణమ్మ 1994, 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు మల్లికార్జున్‌ ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వారు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top