బిగ్‌ బ్రేకింగ్‌: ఈసీ సంచలన నిర్ణయం

Election Commission Has Removed AP Intelligence Chief AB Venkateshwar Rao From Election Duty - Sakshi

ఢిల్లీ: ఏపీ ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీకాకుళం ఎస్పీ  వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మలను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానాల్లో తదుపరి సీనియర్‌ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని తెలిపింది.

పోలీస్‌ వ్యవస్థలో కీలక అధికారులుగా ఉన్న వీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వర రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పలు దఫాలుగా వైఎస్సార్‌సీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top