మంత్రి దేవినేని అనుచరుడి బూతు పురాణం

Devineni Uma Maheswara Rao Aide Warns Common Man - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుల ఆగడాలకు ఐదేళ్లుగా అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో తమ మాట వినని వారిని బెదిరించి దాడులు చేయడానికి సైతం తెగబడుతున్నారు. మంత్రి ఉమాకు కుడిభుజంగా ఉండే జంపాన సీతారామయ్య ఆర్యవైశ్య వర్గానికి చెందిన కుటుంబరావు అనే వ్యాపారిని పచ్చిబూతులు తిడుతూ, బెదిరించిన ఆడియో ఇప్పుడు నియోజకవర్గంలో వైరల్‌ అవుతోంది. ఒక రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికులతో కలిసి కుటుంబరావు తన ఆస్తిని కాపాడుకోవాలనుకోవడమే ఆయన చేసిన తప్పు.

జంపాన సీతారామయ్య.. కుటుంబరావు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ యథాతథంగా..  
కుటుంబరావు: హలో మీరు ఎవరో మీ నంబర్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చినట్లు నా ఫోన్‌లో ఉంది.  
జంపాన సీతారామయ్య: నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే నేనే మీ వద్దకు వద్దామని...
కుటుంబరావు: సార్‌ ఎవరు మీరు?
జంపాన: నేను సీతారామయ్యనయ్యా, నువ్వు రమ్మంటే రావడం కుదరడం లేదు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే అక్కడకు నేనే వద్దామని.
కుటుంబరావు: పనేంటో చెప్పండి  
జంపాన: పని చెబితేనే వస్తావా? ఏంటీ? (స్వరం పెంచి)  
కుటుంబరావు: అవునండి.. పనేంటో ఫోన్లో చెప్పండి..  
జంపాన: అంటే.. చెబితేనే వస్తావా?  
కుటుంబరావు: ఫోన్లో చెప్పండి.. నాతో మీకు పనేముంటుంది?
జంపాన: వెర్రి పూ... గు... తంతా... వెర్రి పూ.. ఏమీటి మాట్లాడుతున్నావు(రెచ్చిపోతూ బూతులు తిడుతూ)  
కుటుంబరావు: మీరేమి మాట్లాడుతున్నారు.. నేనేమి మాట్లాడుతున్నాను..
జంపాన: వెరి పూ..  
కుటుంబరావు: నేనేమి మాట్లాడుతున్నాను.. మీరేమి మాట్లాడుతున్నారు..
జంపాన: వెరి పూ..అక్కడ నుంచి తన్నుకుంటూ తీసుకొస్తాను. రమ్మంటే తమాషాలు దెం...  
కుటుంబరావు : రండి.. తన్నుకుంటూ తీసుకువెళ్లుదురుగాని.. తంతే ఏమౌతుంది?  
జంపాన: వెరి పూ... నన్నే ఎందుకు? ఏమీటంటూ ఎదురు క్వచ్ఛన్‌ చేస్తావా? ఎక్కువ మాట్లాడేవంటే తన్నుకుంటూ తీసుకొస్తా..
కుటుంబరావు: నాకు పనులు ఉంటాయి? నా పనులు మానుకుని  మీవద్దకు రావాల్సిన అవసరం నాకు ఏమీ ఉంటుంది?  
జంపాన: ఏమీటీ? ఏమీ మాట్లాడుతున్నావ్‌
కుటుంబరావు : నాకు కంపెనీ మీటింగ్‌లు జరుగుతున్నాయి. మీకు ఈ విషయం చెప్పాను.  
జంపాన: ఎన్నిరోజులు జరుగుతాయి? నాతో ఐదు నిముషాలు మాట్లాడి వెళ్లడానికి కుదరడం లేదా?  
కుటుంబరావు: 15వ తేదీ వరకు జరుగుతాయి. అర్జెంట్‌ అయితే చెప్పండి వచ్చి మాట్లాడతాను.. అర్జంట్‌ కాదు కదా?
జంపాన: ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పడతావ్‌  ఇబ్బంది పడతావ్‌ (గట్టిగా అరూస్తూ, బెదిరిస్తూ)
కుటుంబరావు: నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా.
జంపాన: వచ్చి నాతో మాట్లాడి వెళ్లమంటే నన్నే ప్రశ్నిస్తావా? గుర్తుంచుకో.
కుటుంబరావు : పనేంటో చెప్పండి సార్‌
జంపాన: చెబితేనే వచ్చి మాట్లాడి వెళ్లతావా?  
కుటుంబరావు : చెబితే సెలవు పెట్టుకుని వచ్చి మాట్లాడివెళ్లతా.. పనిఏమీటో చెప్పండి? బూతులు మాట్లాడతారు ఎందుకు
జంపాన: మళ్లీ పచ్చి బూతులు.. (ఆగ్రహంతో) నాకే ఎదురు చెబుతావా? వచ్చి మాట్లాడి వెళ్లమన్నా.. అంతే వచ్చి వెళ్లాలి.  
కుటుంబరావు: నాతో మీకు పని ఉండదు కదా?
జంపాన: పని ఉంది కాబట్టే రమ్మన్నా.. ఫోన్లో చెప్పాలా?  నువ్వు ఆలోచించుకో.. ఇబ్బంది పడతావ్‌ (తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ)  
కుటుంబరావు: నేనేమి ఇబ్బందులు పడను. పడ్డా మీరే తీర్చేది.  
జంపాన: లం... కో..  తమాషాలు దెం...
కుటుంబరావు: లం ... అంటూ మాట్లాడవద్దు..నేను మీకు చాలా గౌరవం ఇచ్చాను.  
జంపాన: లం .. జాగ్రత్తగా వుండు... రమ్మనగానే రా
కుటుంబరావు: గౌరవంగా మాట్లాడండి చాలు

ఇలా సాగింది వారి సంభాషణ. కాగా, జంపాన సీతారామయ్య కాకితో కబురు పెట్టినా సరే వారు వెంటనే ఆయన వద్ద హాజరు కావాల్సిందే. లేకపోతే ఈ విధంగా భయపెడుతూ బూతులు లంకించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. కొండపల్లి బీ కాలనీ సెంటర్‌ గతంలో వీటీపీఎస్‌ ఉద్యోగస్తులు బస్సుస్టాప్, ఎన్టీఆర్‌ విగ్రహం  ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణలో ఈ రెండు తొలగించారు. ఇటీవల తిరిగి ఉద్యోగస్తులు వాటిని పునఃనిర్మించారు. దీనికి మంత్రి ఉమాను పిలిచారు. అయితే ఆహ్వాన పత్రంలో జంపాన సీతారామయ్య పేరు వేయలేదు. దీంతో సీతారామయ్యకు ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఉద్యోగస్తులకు ఫోన్‌ చేసి వారిపై బూతు  పురాణం లంకించుకున్నారు. స్థానిక నేతల పేర్లు వేయకుండానే కార్యక్రమం చేద్దామనుకుంటున్నారా? మంత్రి వద్ద పెద్దవాళ్లు అయిపోదామను కుంటున్నారా? మీ సంగతి తేలుస్తా.. నాతో పెట్టుకోకండంటూ తిట్టడంతో ఉద్యోగస్తులు నొచ్చుకున్నారు. ఇలా ఉండగా..జంపాన వంటి వ్యక్తులను వెనకేసుకుని తిరిగే వారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని నియోజకవర్గ ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top