బీజేపీని ఓడించడమే లక్ష్యం

CPM calls for unity of secular, democratic forces to defeat BJP - Sakshi

మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కారత్‌

సాక్షి, హైదరాబాద్‌: మతోన్మాద బీజేపీని ఓడించటమే పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై వివిధ రాష్ట్రాల సభ్యులు రెండ్రోజులపాటు చర్చించి, తుది అభిప్రాయాన్ని సభకు నివేదిస్తారు. ఈ సందర్భంగా కారత్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో రాజకీయ వైరం పాటించాలని సూచించారు.

పొత్తులతో పార్టీకి నష్టం జరిగిందని, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు, సామాజిక శక్తులను కలుపుకొని పోయేలా ఎన్నికల ఎత్తుగడ ఉండాలని సూచించారు. అత్యంత కీలకమైన ఈ తీర్మానాన్ని సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెడతారు. కానీ ఈసారి ప్రధాన కార్యదర్శి కాకుండా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టడం గమనార్హం. బహుశా ఇది జాతీయ మహాసభల చరిత్రలోనే మొదటిసారి కావొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top