‘మెరుపులా వచ్చింది.. మెరుపులానే పోతుంది’ | Congress Senior Leader Gulam Nabhi Azad Slams KCR In Jadcherla | Sakshi
Sakshi News home page

‘మెరుపులా వచ్చింది.. మెరుపులానే పోతుంది’

Dec 1 2018 8:08 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Senior Leader Gulam Nabhi Azad Slams KCR In Jadcherla - Sakshi

ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణాను తామే ఇచ్చామని..

జడ్చర్ల: కేసీఆర్‌ స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మెరుపులా వచ్చిందని..ఎన్నికలై పోయిన తర్వాత మెరుపులానే కనపడకుండా పోయిద్దని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన మైనార్టీల సదస్సుకు గులాం నబీ ఆజాద్‌, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు.  ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణాలో మా బలం పెరిగిందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌తో తెలంగాణ రాలేదని, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణాను తామే ఇచ్చామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మా రెడ్డి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement