వలసలను అడ్డుకుందాం!

Congress leaders meeeting in janareddy's house - Sakshi

నష్టనివారణ చర్యల్లో కాంగ్రెస్‌

జానా ఇంట్లో ముఖ్యుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ మంత్రి దానం నా గేందర్‌ రాజీనామా, మరికొందరు సీనియర్లు అదే బాటలో నడువనున్నారన్న వార్తల నేప థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది.  పీసీసీ ముఖ్య నేతలు సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివా సంలో శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, వి.హన్మంతరావు, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

నేతలు పార్టీ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారంతా మల్లగుల్లాలు పడ్డారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలు, వలసలకు అడ్డుకట్ట, అధికార టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలను త్వరగా చేర్చుకోవడం, పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. ఎవరూ వీడినా కాంగ్రెస్‌కు నష్టం లేదని,  అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా చూడాలని నిర్ణయించారు.

టీఆర్‌ఎస్‌కు చిక్కకుండా నేతలను అప్రమత్తం చేయాలని భావించారు. పార్టీ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చి అసంతృప్తి సెగలను చల్లార్చాలన్న అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేనని భేటీ అనంతరం వీహెచ్‌ అన్నారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరిగితే  ఊరుకోనన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top