కాంగ్రెస్‌ ప్రచార నినాదం ఇదే..

Congress Launches Campaign Slogan For Lok Sabha Polls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సరికొత్త ప్రచార నినాదాన్ని వినిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని స్పష్టం చేస్తూ ‘ఇక న్యాయం జరుగుతుంది’ అనే నినాదాన్ని ఆ పార్టీ ఆదివారం ప్రారంభించింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న కనీస ఆదాయ హామీ పధకం న్యాయ్‌ను ప్రతిబింబించేలా ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది.

ఈ థీమ్‌ సాంగ్‌ను ప్రముఖ బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ రచించగా, ప్రచార వీడియోను నిఖిల్‌ అద్వానీ తెరకెక్కించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ వెల్లడించారు. వీడియో స్క్రీన్‌లు అమర్చిన వాహనాల ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ నినాదాన్ని, విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువెళతామని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సంపూర్ణ న్యాయం చేసేలా తమ ఎన్నికల ప్రణాళిక ఉందని, ఇదే అంశాన్ని థీమ్‌ సాంగ్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top