సీఎం నిర్లక్ష్యంతోనే పథకాల్లో జాప్యం

CLP Leader Jeevan Reddy Slams CM KCR - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే పథకాల అమలులో జాప్యం జరుగుతోందని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌ ప్రారంభమై 45 రోజులు కావస్తున్నా.. పంటల రుణప్రణాళికను వందశాతం అమలుచేయడంలో ప్రభుత్వ ం విఫలమైందన్నారు. శనివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తే అమలు చేయాల్సి న బాధ్యత అధికారులదని, అయితే సీఎం అన్ని తానై.. మంత్రివర్గ సభ్యులు, సంబం ధితశాఖల అధికారులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఎవరేమీ చేయలేకపోతున్నారని తెలిపారు. ఏ పథకం అమలు చేసినా.. మం త్రులు, అధికారులకు విధివిధానాలు చెప్పకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.

ఖరీఫ్‌ ప్రారంభమై 45 రో జులు గడుస్తున్న బ్యాం కర్లు ఇప్పటికీ రు ణప్రణాళిక అమలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. ఖరీఫ్‌ రుణప్రణాళిక కింద ప్రభుత్వం రూ.25వేల కోట్లు పంట రుణాలను అందించాలని నిర్ణయించిందని, కానీ.. రూ.5 వేల కోట్లు మాత్రమే పంపిణీ అయ్యిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.  రుణాలివ్వాలంటే బ్యాంకర్లు పహణీ, 1–బీ అడుగుతున్నారని, కానీ.. ప్రభుత్వం మీసేవ కేంద్రాల ను ంచి వాటిని నిలిపివేసిందని విమర్శించారు.

 
గల్ఫ్‌లో ఉన్నవారు తెలంగాణ రైతులు కాదా ? 
గల్ఫ్‌లో ఉన్న రైతుల పేరిట వచ్చిన పట్టాదార్‌ పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందించేం దుకు ప్రభుత్వం ఎందుకు మీ నమేషాలు లెక్కిసో ్తందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. వారు తెలంగా ణ రైతులు కాదా..? అని ప్రశ్నించారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల ను కుటుంబ సభ్యులకు ఇస్తే నష్టమేంటన్నారు. దీనిపై ప్రభు త్వ ం తక్షణమే సానుకూలనిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
రైతుబీమాను అందరికీ  వర్తింపజేయాలి.

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకాన్ని రైతులతోపాటు వ్యవసాయకూలీలు, కౌలుదారులకూ వర్తింపజేయాలని జీవన్‌రెడ్డి సూచించారు. కూలీలు పొలాల వద్ద ప్రమాదాలబారిన పడి మరణిస్తే.. వారి కుటుంబాలు వీధిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కూలీలు, కౌలుదారులు 90శాతం మంది దళితు లు, బలహీనవర్గాలవారేనన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల న్నారు. బీమా నిబంధనలో 60ఏళ్ల వరకే వర్తింపజేయడం సరికాదని, మరణాల రికార్డులను పరిశీలించి 70 ఏళ్లకు పెంచాలని సూచించారు.
  
శుద్ధీకరణలో యాజమాన్యపు హక్కు మాయం                                                                                                                                                                                        
భూ రికార్డుల శుద్ధీకరణ ద్వారా పట్టాదారు యాజమాన్యపు హక్కు కోల్పోతున్నాడని జీవన్‌రెడ్డి విమర్శించారు. గతంలో రైతులకు తన భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం, యాజమాన్యపు హక్కుపత్రం (టైటిల్‌డీడ్‌)లను వేర్వేరుగా ఇచ్చేవారని, టైటీల్‌డీడ్‌లో రైతుకు ఎంత భూమి ఉందన్న విషయాన్ని పొందుపరిచేవారని, పట్టాదారు పాసుపుస్తకంలో భూమి వివరాలతోపాటు, ఇల్లు, రోడ్డు, తదితర పనులు చేపడితే వాటి వివరాలు నమోదు చేసేవారని గుర్తు చేశారు.

ప్రస్తు తం పట్టాదార్‌పాస్‌ పుస్తకం మాత్రమే ఇస్తోందని, ఇందులోనూ భూముల వివరాలు సమగ్రంగా లేవని తెలిపారు. తద్వారా రైతు తన భూమి మీద హక్కు కోల్పోతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల కమతాలు ఉంటే ఇప్పటివరకు 40 లక్షల పాసుపుస్తకాలు మాత్రమే పంపిణీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్రంగా ఉందని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భూక్య సరళ, మాజీ ఎంపీటీసీ మసర్తి రమేష్, పాల ఉ త్పత్తి సంఘం చైర్మన్‌ కాలగిరి సత్యనారయణరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కొక్కు గంగారాం, ఎదులాపురం లింగయ్య, ఏలేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top