వాళ్లను ఎక్కువ గౌరవిస్తా: చంద్రబాబు | Chandrababu Naidu Controversial Comments | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

Mar 17 2019 5:03 PM | Updated on Mar 17 2019 5:48 PM

Chandrababu Naidu Controversial Comments - Sakshi

చంద్రబాబు ఎన్నికల ప్రచారం చూసి తెలుగు దేశం పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు.

సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చూసి తెలుగు దేశం పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన మాట తీరుపై తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంత అనుభవమున్న అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం నగరంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఎవరు ఎక్కువ మెజారిటీ తీసుకువస్తే... అక్కడ అంతగా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఏ ప్రాంతంలో ఎక్కువ మెజారిటీ వస్తే ఆ ప్రాంత నాయకుడికి మంత్రి పదవి ఇస్తానని, ఎక్కువ గౌరవిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంతటిని సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సొంత పార్టీ కార్యకర్తలే తప్పుబడుతున్నారు. మెజారిటీ ఎక్కువ వస్తేనే అభివృద్ధి చేస్తామనడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్‌ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement