హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు! | BJP Leader Raghunandan Rao comments on Harishrao | Sakshi
Sakshi News home page

Sep 22 2018 2:37 PM | Updated on Sep 22 2018 8:32 PM

BJP Leader Raghunandan Rao comments on Harishrao - Sakshi

సాక్షి, మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంచనకు మారుపేరు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు దుయ్యబట్టారు. అల్లుడు హరీశ్‌రావును పొమ్మనలేక పొగ బెట్టినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోందని, హరీశ్‌కు పొగబెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఇంటిపోరు తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. దీనిని ఉహించే కారుకు ఉన్నటువంటి 4 టైర్లలో ఒక టైరు పంచరై పక్కకు పోతుందని, అందుకే స్టెప్నీగా సంతోష్‌ను రాజ్యసభకు తెచుకున్నారని ఎద్దేవా చేశారు. ‘ఈ జన్మకు ఇది చాలు.. నా మీద ఇంత గొప్పగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది’అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ మేరకు స్పందించారు.

చదవండి: రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement