‘ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు షాడో టీమ్‌’ | BJP Leader Kanna Laxminarayana Criticize On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు షాడో టీమ్‌’

Mar 21 2019 4:26 PM | Updated on Mar 21 2019 4:51 PM

BJP Leader Kanna Laxminarayana Criticize On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విచక్షణా జ్ఞానం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాంగ్రెస్‌, జనసేన పార్టీలతో అంటకాగుతూ బీజేపీ ఆరోపణలు చేయడాన్ని ట్విటర్‌లో తప్పుబట్టారు. బీజేపీకి వైఎస్సార్‌సీపీ బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై కన్నా ఘాటుగా స్పందించారు.

పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు షాడో టీమ్‌ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుకు బీ టీమ్‌గా పనిచేస్తోందన్నారు. జనసేన, కమ్యూనిస్టు, కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీలు.. వరుసగా సీ, డీ, ఈ టీమ్‌లుగా ఉన్నాయని ఆరోపించారు. టీడీపీకి మాయవతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఎఫ్‌ టీమ్‌గా ఉందని కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement