‘ఇది జగన్‌ ప్రభుత్వం.. లంచాలు ఉండవు’

Avanthi srinivas Rao Says There Is No Chance For Bribes In YS Jagan Government - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మార్కెటింగ్‌ కమిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని.. రైతుల ప్రయోజనం కోసమే కృషి చేస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ పోస్టులకు ఎలాంటి లంచాలు లేవన్నారు. పరీక్షలు రాసే అర్హులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాన్నాయన్నారు. మంత్రిగా తాను కూడా నిబంధనలకు విరుద్ధగా ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేనన్నారు. ఇది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమని, ఇక్కడ లంచాలకు తావు ఉండదని వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులను ఆపుదామని సీఎం జగన్‌ అనలేదని, అవినీతిని అడ్డుకుందామని చెబుతున్నారని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది ఒకటే పార్టీ, ఒకటే ప్రభుతవం ఉంటుందని, అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. పర్యాటక, క్రీడారంగాల్లోని ఖాళీలను స్థానికులతో భర్తీ చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి ఉగాది నాటికి సొంత ఇల్లులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు భజన పరులు అనవసరపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులకు తమ ప్రభుత్వంలో శిక్ష పడడం ఖాయమని హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top