పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి | Avanthi Srinivas comments on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి

Nov 5 2019 4:40 AM | Updated on Nov 5 2019 4:40 AM

Avanthi Srinivas comments on Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌ని చూస్తే పవన్‌కళ్యాణ్‌ ఓ అజ్ఞాన వాసిగా ప్రజలందరికీ అర్థమైందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ చెప్పా రు. వైఎస్సార్‌సీపీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే ఈ మార్చ్‌ చేశారు తప్ప.. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం కాదన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నకు ఉన్న పేరును అడ్డంపెట్టుకుని సినిమాల్లో ఎదిగిన పవన్‌కళ్యాణ్‌కు.. స్వయంకృషితో ఎదిగిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

జర్నలిస్ట్‌ స్థాయి నుంచి ఓ మంత్రి స్థాయికి ఎదిగిన కురసాల కన్నబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది మీ కుటుంబమా?.. అలాంటప్పుడు రెండుచోట్ల పోటీచేసి ఎందుకు ఓడిపోయావు.. కాపు వర్గంలో నీ కుటుంబం తప్ప ఎవరూ ఎదగకూడదా.. అని పవన్‌ను ప్రశ్నించారు.‘లాంగ్‌మార్చ్‌లో రెండు కిలోమీటర్లే నడవలేకపోయావ్‌.. నీకెందుకు రాజకీయాలు’ అంటూ విరుచుకుపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement