ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ | AP CM YS jagan Meeting With PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

Oct 5 2019 4:44 PM | Updated on Oct 5 2019 9:01 PM

AP CM YS jagan Meeting With PM Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన... సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని, అదే విధంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.



విజయవాడకు సీఎం జగన్‌..
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ విజయవాడకు బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement