కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో: అంజన్‌కుమార్‌ | anjan kumar commented over ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో: అంజన్‌కుమార్‌

Jul 7 2018 2:39 AM | Updated on Jul 7 2018 2:39 AM

anjan kumar commented over ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మ, బొమ్మ అంటున్న కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ఊదు కాలదు, పీరూ లేవదని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, కేటీఆర్‌ ఎక్కడో ఉన్నప్పుడే కాంగ్రెస్‌ తెలంగాణ కోసం ఆలోచించిందన్నారు.

అమరవీరుల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, సోనియాగాంధీని అమ్మ బొమ్మ అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement