బీజేపీ రక్తంలోనే దేశభక్తి: అమిత్‌ షా | amit shah takes on chandrababu naidu comments | Sakshi
Sakshi News home page

బీజేపీ రక్తంలోనే దేశభక్తి: అమిత్‌ షా

Feb 21 2019 2:13 PM | Updated on Feb 21 2019 4:26 PM

amit shah takes on chandrababu naidu comments  - Sakshi

సాక్షి, రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్‌ షా విరుచుకుపడ్డారు. దేశ ప్రధానిపై విశ్వాసం లేదంటున్న చంద్రబాబు నాయుడు పాకిస్థాన్‌ ప్రధానిపై విశ్వాసం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. నాడు మోదీ ఇమేజ్‌తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

ఉభయ గోదావరి జిల్లాల్లో అయిదు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ...బీజేపీ రక‍్తంలోనే దేశభక్తి ఉందని అన్నారు. ఈ అయిదేళ్లలో దేశభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అమరజవాన్లకు ఈ వేదిక నుంచి నివాళులు అర్పిస్తానని ఆయన తెలిపారు. భారత సైనికులకు బీజీపీ సర్కార్‌ అన్నివిధాలా అండగా ఉంటందని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి రావడం సంతోషంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. అంతకు ముందు ఆయన రాజమండ్రిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement