ఆ పార్టీలకు రూ 11,234 కోట్ల అజ్ఞాత విరాళాలు

ADR Says National Parties Got More Donations From Unknown Sources - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు 2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి.ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్‌ ఫండ్‌, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.

2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్‌ పేర్కొంది.

చదవండి : ఆ మంత్రులంతా కోటీశ్వరులే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top