‘నువ్వో, నేనో తేల్చుకుందాం!’ | Adduri Sriam Fires On Buddha Venkanna | Sakshi
Sakshi News home page

‘నువ్వో, నేనో తేల్చుకుందాం!’

Mar 6 2019 2:36 PM | Updated on Mar 6 2019 2:56 PM

Adduri Sriam Fires On Buddha Venkanna - Sakshi

మాట్లాడుతున్న అడ్డూరి శ్రీరామ్‌ (ఫైల్‌)

సాక్షి, విజయవాడ : ‘బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా పనికిరాడు.. దమ్మూ, ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చెయ్‌. పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను బీజేపీ తరుపున నిలబడతా.. నువ్వో నేనో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అంటూ బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న స్ధాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షస‌ పాలన కొనసాగుతోందన్నారు.

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులివ్వలేదని టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎవ్వరు తిడితే వారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవులివ్వడం సిగ్గుచేటన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అడిగిన వంద ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. దమ్ముంటే చంద్రబాబును కన్నాతో డిబేట్‌కు రప్పిస్తారా అని సవాల్‌ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement