ఖాసీం రజ్వీని మించిన సీఎం కేసీఆర్‌

addanki dayakar commented over kcr - Sakshi

అద్దంకి దయాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసుల నిర్బంధంతో.. రజా కార్ల నేత ఖాసీం రజ్వీని మించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ విమర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, దరువు ఎల్లన్నలతో కలసి గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్లనివ్వకుండా అడ్డు కోవడమేంటని.. దీనికి ప్రభుత్వం సమా ధానం చెప్పాలని దయాకర్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసులను ఓయూకు పంపడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరో పించారు. ఓయూలో ఏ గొడవ, అల్లర్లు చేయకుండానే పోలీసులు దాడికి దిగార న్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలే∙బుద్ధి చెప్తారన్నారు. మురళి ఆత్మహత్యపై అను మానాలున్నాయని, సిట్టింగ్‌ జడ్జితో లేదా రిటైర్డు జడ్జితో విచారణ జరిపించాల న్నారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Back to Top