నాడు 6 పైసలు.. నేడు రూ.46

6 paise to rs 46 poll expense per elector - Sakshi

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంటే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగాయి. అభ్యర్థులూ పెరిగారు. దాంతో పాటే ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఒక ఓటరుకు 6 పైసలు ఖర్చయినట్టు. అదే 2014 నాటికి ఎన్నికల వ్యయం రూ.3,870 కోట్లకు చేరింది. అంటే ఒక ఓటరుపై రూ.46 వెచ్చిస్తున్నారు.

2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఒక ఓటరుపై రూ.15 ఖర్చు చేసింది. అభ్యర్థుల ప్రచార వ్యయం, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మినహా మిగతా ఖర్చు ఇది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రచారం చేపట్టడం, దాని కోసం భారీగా ప్రకటనలు జారీ చేయడం, ఎన్నికల జాబితాలను డిజిటలైజ్‌ చేయడం వంటి చర్యలతో ఇటీవల ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న గౌరవ భృతి పెరగడం, వారికి శిక్షణ నివ్వడానికి రాకపోకల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీల ప్రచారాన్ని, పోలింగ్‌ సరళిని వీడియో తీస్తున్నారు. దీని ఖర్చు కూడా ఎన్నికల సంఘం ఖాతాలోకే వెళుతుంది.

అమెరికా కంటే ఎక్కువ
దేశంలో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల వ్యయం దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉండవచ్చని, బహుశా ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత ఖర్చు ఉండదని వారంటున్నారు. 2016లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్‌ ఎన్నికలు కలిపి జరిగాయి. వీటికి మొత్తం 650 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 2014లో మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు 500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. 2019 ఎన్నికల వ్యయం దీన్ని మించిపోతుందని కార్నేజ్‌ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ థింక్‌ ట్యాంక్‌కు చెందిన మిలన్‌ వైష్ణవ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు

18-05-2019
May 18, 2019, 08:28 IST
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్,...
18-05-2019
May 18, 2019, 08:14 IST
సాక్షి, కడప:  జమ్మలమడుగు నియోజవర్గం టీడీపీకి 1983 నుంచి 2004 వరకు కంచుకోటగా నిలిచింది. వరుసగా ఐదు పర్యాయాలు పొన్నపురెడ్డి కుటుంబీకులకు  మద్దతుగా...
18-05-2019
May 18, 2019, 07:35 IST
చుంచుపల్లి: జిల్లాలో పరిషత్‌ పోరు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా...
18-05-2019
May 18, 2019, 05:48 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా తక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌ ఒక్కటే. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు ఉన్న బీజేపీ ఈ...
18-05-2019
May 18, 2019, 05:17 IST
సరిహద్దుల్లో దేశభద్రతకోసం సాహసోపేతంగా పోరాడిన సినీ హీరో ఇప్పుడు రాజకీయ బరిలో నిజమైన సమరాన్ని ఎదుర్కోబోతున్నారు. ‘బోర్డర్‌’, ‘గదర్‌ –ఏక్‌...
18-05-2019
May 18, 2019, 05:01 IST
మధ్యప్రదేశ్‌ చివరి దశ కీలకం లోక్‌సభ ఎన్నికల చివరి దశలో మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. దళితులు, ఆదివాసీల జనాభా...
18-05-2019
May 18, 2019, 04:44 IST
కాంగ్రెస్‌ పార్టీకి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించిన ఈ పార్టీ, స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాల...
18-05-2019
May 18, 2019, 04:16 IST
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు...
18-05-2019
May 18, 2019, 04:02 IST
మిర్జాపూర్‌/గోరఖ్‌పూర్‌(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్‌ బచ్చన్‌ సరైన వ్యక్తి అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి...
18-05-2019
May 18, 2019, 03:56 IST
సాక్షి, బెంగళూరు: రాహుల్‌ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త...
18-05-2019
May 18, 2019, 03:42 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. 38 రోజుల పాటు ఏకధాటిగా సాగిన...
18-05-2019
May 18, 2019, 03:30 IST
న్యూఢిల్లీ/సిమ్లా:  లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో...
18-05-2019
May 18, 2019, 03:18 IST
న్యూఢిల్లీ/ఖర్గోన్‌(మధ్యప్రదేశ్‌): బీజేపీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు....
18-05-2019
May 18, 2019, 00:38 IST
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆదివారం 59 స్థానాలకు జరగబోయే చివరి దశ పోలిం గ్‌కు ప్రచార ఘట్టం...
17-05-2019
May 17, 2019, 20:56 IST
సాక్షి, అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో దళితుల్ని ఓటు వేయకుండా చేసి వారి ఓట్లు తెలుగుదేశం పార్టీ నేతలే వేయడం అప్రజాస్వామికమా?...
17-05-2019
May 17, 2019, 20:03 IST
లోక్‌సభ తుది విడత ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.
17-05-2019
May 17, 2019, 19:59 IST
పచ్చతమ్ముళ్ల బాగోతం బయటపడడంతో షాకైనా బాబు.. అక్కడ నుంచి సైలెంట్‌గా వెనక్కొచ్చేశారు.
17-05-2019
May 17, 2019, 19:09 IST
ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోతే! అంటే బీజేపీ పార్టీకి అధికారం సిద్ధించకపోతే!
17-05-2019
May 17, 2019, 19:04 IST
మోదీ నేత కాదు..నటుడే..
17-05-2019
May 17, 2019, 18:17 IST
కౌంటింగ్‌ రోజు ఉగ్ర దాడికి ప్రణాళిక..?
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top