అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు

25 Percent Quota For Poor Among Upper Castes - Sakshi

లక్నో: అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రాందాస్‌ అథవాలే ప్రతిపాదించారు. అందుకు రిజర్వేషన్‌ కోటాను 75 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

‘ఉన్నత కులాల్లోని పేదలకు 25 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే అది అందరికీ ఉపయోగకరం. 75 శాతానికి రిజర్వేషన్లను పెంచాలి. ఇందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని అన్నారు. ఓబీసీలకు, దళితులకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయంలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే వీలుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top