
పెద్దపల్లి: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ, వేణుగోపాల్ తల్లి, మల్లోజుల మధురమ్మకు జిల్లా కేంద్రంలో నిర్వహించే రిపబ్లిక్‌డే ఉత్సవాల ఆçహ్వానం అందింది. జిల్లా కలెక్టర్ తరఫున ఆహ్వానాన్ని జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంఘం అధ్యక్షుడు బాలసాని వెంకటేశంగౌడ్ అందించారు.
స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానపత్రాలు కలెక్టర్ పక్షాన పలువురికి అందించారు. మధురమ్మ భర్త మ ల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర సమర యోధుడు కావటం వల్లే ఆహ్వానం అందినట్లు భావిస్తున్నారు.