విశ్వవీణ పాడుతున్న పాట | On february 21st to be celebrated for International Mother Language Day | Sakshi
Sakshi News home page

విశ్వవీణ పాడుతున్న పాట

Feb 19 2014 2:12 AM | Updated on Sep 2 2017 3:50 AM

విశ్వవీణ పాడుతున్న పాట

విశ్వవీణ పాడుతున్న పాట

విభిన్న ప్రాంతాల్లో పోగుపడుతున్న వేర్వేరు విజ్ఞానదాయక సమాచారానికి సమగ్రతను సమకూర్చడం, దాన్ని భద్రపరచడం, రేపటి తరాలకు అందించడం తెలుగోడు సమర్థంగా నిర్వర్తించగలడని ప్రపంచం నమ్ముతున్నది.

విభిన్న ప్రాంతాల్లో పోగుపడుతున్న వేర్వేరు విజ్ఞానదాయక సమాచారానికి సమగ్రతను సమకూర్చడం, దాన్ని భద్రపరచడం, రేపటి తరాలకు అందించడం తెలుగోడు సమర్థంగా నిర్వర్తించగలడని ప్రపంచం నమ్ముతున్నది.
 
 ‘చెయ్యెత్తి జైకొట్టు తెలు గోడా!’ అన్నాడు వేముల పల్లి శ్రీకృష్ణ. తెలుగు వారికి ఒక రాష్ర్టర కావా లనే కోరికతో విశాలాంధ్ర సాధన దిశగా ఇచ్చిన ఆ పిలుపు ఆనాడు తన కర్త వ్యాన్ని నిర్వర్తించింది. దేశాల ఎల్లలు దాటి గ్లోబల్ విలేజ్ పేరిట విశ్వ గ్రామం రూపుదిద్దుకొంటున్న ఆధునిక ప్రపం చంలో విశాలాంధ్రను, ఆంధ్రప్రదేశ్‌ను, సీమాంధ్రను, తెలంగాణను దాటి విశాల విశ్వంలో తెలుగోడు తనను తాను తెలుసు కోవాలి; తన కర్తవ్యాన్ని సమీక్షించుకోవాలి; తిరిగి నిర్వచించుకోవాలి. చురుకు బుద్ధికి పాదరసం పోలిక అయినట్లు తెలుగోడి వ్యక్తి త్వానికి తగిన ఉపమానం ‘కలకండ’.
 
 తియ్యదనం భాష నుండి జాతికి సంక్ర మించిందో లేక జాతి నుండి భాషకు అలవ డిందో చెప్పడం కష్టర గానీ మాధుర్యర విష యంలో రెండూ సమానమే. తెలుగు భాష, తెలుగోడి వ్యక్తిత్వర రెండూ కలకండ పలుకు మాదిరే పైకి కించిత్ కఠినం, లోన ఆపాత మధురం. కాబట్టే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెగ్గుకొస్తున్నాడు. రేపటి ప్రపంచ అవస రాలు తీర్చే బాధ్యతను తలెత్తుకోడానికి తగినట్లు తమను తాము దిదు కోడానికి తెలుగుజాతి సమాయ త్తర కావాలి.
 
 భౌగోళిక స్వరూప స్వభా వాల్లో, భాషా, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక రాజకీయ వ్యవ హారాల్లో భిన్న భిన్న ప్రాంతాలకు వెళ్లిన తెలుగువారు ప్రతిచోటా తమ ప్రత్యేకతను నిలుపుకొం టూనే మాధుర్యాన్ని పంచుతు న్నారు. ఆ వ్యక్తిత్వమే అతడిని పరదేశాల్లో సైతం ఉన్నత పదవు లపై అధిష్ఠింపజేస్తున్నది. తెలుగు వారి జ్ఞానభాండా గారంలో చేరుతున్న సమాచా రంలో రాగాలు పలికించే రాతి స్తంభాల నిర్మా ణం నుండి అంతరిక్ష రహస్యాలను ఛేదించే ఉపగ్రహ నిర్మాణ, ప్రయోగాల దాకా ఉంది. చెట్టు చేమలతోసహా సమస్త జీవుల వృద్ధి, క్షయాలను నియంత్రించే పరిజ్ఞానం నుండి, మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనంద మయ జీవితాన్ని గడపడానికి తగిన జీవన ప్రణాళికా శాస్త్రాలు కళలు ఉన్నాయి.
 
 వ్యక్తులు, జాతుల వికాసానికి విజ్ఞానమే ప్రాణమనీ, జ్ఞానానికి, విజ్ఞానానికి, సమా చారమే మూలమని ఎరిగిన వారందరికీ తెలు గోడి పరిధిలోకి వస్తున్న సమాచార సంపద పరిమాణం గమనిస్తే ఇతరుకు అసూయ కలుగకమానదు. విభి న్న ప్రాంతాల్లో పోగుపడుతున్న వేర్వేరు విజ్ఞానదాయక సమాచా రానికి సమగ్రతను సమకూర్చ డం, దాన్ని భద్రపరచడం, రేపటి తరాలకు అందించడం తెలుగోడు సమర్థంగా నిర్వర్తించగలడని ప్రపంచం నమ్ముతున్నది.
 
 తమిళనాడులోని తెలుగు ప్రజల విద్యా సమస్యలను ప్రస్తా విస్తూ తమిళనాట మొత్తర జనా భాలో 42 శాతం తెలుగు ప్రజలు ఉన్నారని కుళితల నియోజకవర్గ ఎమ్మెల్యే లెక్క చెప్పారు. కర్ణాటక జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు తెలు గువారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస పురం నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ అన్న మాట ఇది. ఒరిస్సాలో 22 శాతం, మహా రాష్ర్టలో 16 శాతం తెలుగు ప్రజలు ఉన్నారు. కేరళ ముఖ్యపట్టణం తిరువనంతపురంలో కరమన ప్రాంతం (ఒక పేట)లో 500 తెలుగు కుటుంబాలున్నాయి. ఉత్తర కేరళ ప్రాంతం లోని తలచేరి తాలూకాలో 1000 దేవాంగుల కుటుంబాలున్నాయి. కేరళలోని తెలుగు వారై న ‘ఆండి పండారం’ అనే సంచార జాతి నేటికీ ప్రదర్శిస్తున్న ‘కూడియాట్టం’ అనే తెలుగు జానపద కళా రూపమే కేరళ ప్రసిద్ధ ‘కథాకళి’కి మూలం అంటారు.
 
 పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని మాళ్వ ప్రాం తంలో ‘కులోంగ్’ అనే తెలుగు సంచార కులం వారు 3 లక్షల మంది (ఈతాకుల చీపుర్లు తయారు చేసి అమ్మేవారు) ఉన్నారు. ఛత్తీస్ గఢ్‌లోని ఇంద్రావతి నది సమీపంలోని దక్షిణ బస్తర్‌లో వేలాది మంది, రాజస్తాన్‌లో వేలా దిగా గల ‘బహురూపి’ అనే సంచార జాతి జనులు తెలుగువారే. అంతెందుకు: భారత దేశంలోని సంచార జాతుల్లో సగం మంది తెలుగు వారే.
 
 శ్రీలంకలో తెలుగు మూలాలకు చెందిన ‘అహికుంటికలు’ అనే తెగలో జీవనోపాధిగా మగవాళ్లు పాములు ఆడిస్తే ఆడాళ్లు పచ్చ బొట్లు పొడుస్తారు. ‘రామ కులువర్’ అనే మరోతెగ కోతులను ఆడిస్తారు. ఇలా ప్రపం చం అంతటా వ్యాపించిన తెలుగు వారి జన సంఖ్య లెక్కిస్తే ఇరువది కోట్లకు పైమాటే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అం తర్జాతీయ ఐక్యత, విజ్ఞాన సమీకరణ, విశ్వ మానవ కల్యాణం, ప్రగతి కోసమై వినియోగం అనే లక్ష్యాల సాధనకు తెలుగోడి శక్తియుక్తులు ఉపయోగపడితేనే సార్థకత!    
 (ఫిబ్రవరి 21 అంతర్జాతీయ  మాతృ భాషా దినోత్సవం)
 (వ్యాసకర్త సామాజిక కార్యకర్త)

-  పె. వేణు గోపాల రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement