భూతల స్వర్గమా! వెతల మార్గమా? | Bifurcation being done for political reasons | Sakshi
Sakshi News home page

భూతల స్వర్గమా! వెతల మార్గమా?

Oct 12 2013 2:47 AM | Updated on Jun 18 2018 8:10 PM

భూతల స్వర్గమా! వెతల మార్గమా? - Sakshi

భూతల స్వర్గమా! వెతల మార్గమా?

దేశంలో ఏ రాష్ట్రాన్ని అయినా ఎందుకు పునర్విభజించాలి? ఆ పునర్విభజన లక్ష్యాలు ఏమిటి? పురోగమిస్తున్న ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధత ఎలాంటిది?

దేశంలో ఏ రాష్ట్రాన్ని అయినా ఎందుకు పునర్విభజిం చాలి? ఆ పునర్విభజన లక్ష్యాలు ఏమిటి? పురోగమి స్తున్న ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధత ఎలాంటిది? ప్రస్తుతం రాష్ర్ట పరిస్థి తులను చూసిన తర్వాత ఈ ప్రశ్నలు చాలా మంది వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు జరుగు తున్న ప్రయత్నం నిలకడగా సాగే అభివృద్ధి పునాదిగా ఉండాలన్న దృష్టితో జరుగుతున్నదా? లేదా 2009 తర్వాత పరిణామాల కారణంగా కొన్ని రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఆ ప్రయత్నం జరుగుతున్నదా? కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ కారణాలవల్ల విభజన అనివార్యమైతే ఆ ప్రక్రియ న్యాయబద్ధంగా జరుగుతోందా? 12వ పంచవర్ష ప్రణాళిక ఆర్థికవ్యవస్థలో శీఘ్రగతిన ప్రగతిని తిరిగి తీసుకురావాలని చెబుతోంది. ఆ ప్రగతి సమ్మిళిత వృద్ధి, నిలకడగా సాగే వృద్ధి అనే ఆశయాలతో కూడినది. విభజన ప్రయత్నంలో ఈ అంశాలకు ప్రాధాన్యం దొరుకుతోందా?
 
 ప్రాతిపదికే పెద్ద గందరగోళం
 రాష్ట్రాల పునర్విభజనకు జరుగుతున్న ఏ ప్రతిపాదనకైనా దేశ సమగ్రత, ఐక్యత ప్రధాన ధ్యేయంగా ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి పెరు గుదలకు దోహదం చేసేదిగా ఉండాలి. పరిపాలనా సౌలభ్యాన్ని మరింత సరళం చేసి, పాలనా వ్యయాన్ని తగ్గించాలి. మంచి పాలనకు ఆస్కారం కల్పించాలి. మరీ ముఖ్యంగా పునర్విభజన జరుగుతున్న రాష్ట్రాలు స్వయంసమృద్ధి కలిగి ఆర్థికంగా పరిపుష్టమై ఉండాలి. కలిసి ఉన్నప్పటి కాలం నాటి పరిస్థితులకంటే పౌరులకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. 1955 నాటి రాష్ట్రాల పున ర్విభజన సంఘం నివేదికలో (2వ భాగం) పునర్విభజన అనివార్యమైతే జాతీ య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజ నకు భాషను ప్రాతిపదికగా తీసుకోవడంలోని ప్రయోజనం గురించి ఈ నివేది కలో ఉంది.

 

ఒకే భాష వల్ల పరిపాలన సులభమవుతుంది. కుల మతాలను బట్టి కాకుండా భాష సాయంతో ప్రజలందరినీ సమంగా గుర్తించే అవకాశం ఉంటుం దని కూడా చెబుతోంది. 1949, ఏప్రిల్ 1 నాటి జేవీపీ (జవహర్ వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభి) నివేదిక చెప్పిన మాటలను కూడా చూడాలి. ప్రజల మనోభా వాలు విభజనపట్ల గాఢంగా మొగ్గి ఉంటే ప్రజాస్వామికవాదులుగా దానిని గౌర వించాలి. అయితే భారత్ అఖండంగా ఉంచడానికి ఉన్న పరిమితులను కూడా గమనించాలని ఆ నివేదిక సూచించింది. 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన ప్రకటన కూడా గుర్తుండే ఉంటుంది. ఒకే కుటుంబంలోనే వివాదాలుంటాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాదు, ఆయా రాష్ట్రాలలో కూడా ఇలాంటి హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంతా లను వెనుకబడిన వాటిగా చెబుతారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడినదిగా పేరున్నప్పటికీ కొన్ని మెరుగైన పరిస్థితులు ఉన్న ప్రాంతాలు కూడా అక్కడ ఉండి తీరతాయి. రెండు ప్రాంతాలను పోల్చి చూసినప్పుడు అందులో ఒకటి వెనుకబడి ఉన్నదనే ఒక్క కారణంతో తిరుగులేని నిర్ణయాలను తీసుకోవడం సాధ్యం కాదు. విభజనకు అదే ప్రాతిపదిక అయితే దానికి అంతం ఎక్కడ?


 కొందరు ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని సలహా ఇస్తున్నారు. మూడు, నాలుగు రాష్ట్రాలుగా ఆ రాష్ట్రాన్ని విభజిస్తామా? దేశాన్ని సంస్థానాల కాలం నాటికి తిరోగమింపచేస్తామా? విభజన అంశానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. వెనుకబాటునే చూపి విభజన చేయవచ్చునని ఎవరూ చెప్పలేరు. ఆర్థిక వెనుక బాటుతనాన్ని కష్టపడి పనిచేయడంవల్ల, దేశం మొత్తం చేయూతనివ్వడం వల్ల అధిగమించవచ్చు. వెనుకబాటుతనమనేది వాస్తవంగా సర్వసాధారణమైన సమస్య. దారిద్య్రంలో భాగం. ఈ అంశాలన్నీ ఉద్వేగాల ప్రాతిపదికగా కాకుం డా శాంతియుత వాతావరణంలో సమష్టిగా ఆలోచించవలసినవే. 13వ కేంద్ర ఆర్థిక కమిషన్ ఇచ్చిన నివేదికలో వివిధ రాష్ట్రాల మధ్య పోల్చి చూడదగ్గ తలసరి (జీఎస్‌డీపీ) ఆదాయాల గురించి పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం (మన 28 రాష్ట్రాలలో) మధ్యప్రదేశ్ 26, ఉత్తరప్రదేశ్ 27, బీహార్ 28 స్థానాలలో ఉన్నాయి.

 

కొత్తగా ఏర్పాటుచేసిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్‌ల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ కాదు. 13వ కేంద్ర ఆర్థిక కమిషన్ చెప్పిన ప్రకారమే గోవా, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, పం జాబ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు చిన్నవి కావడం మూలంగానే ధనిక రాష్ట్రాలుగా అవతరించాయని ఎవరైనా రుజువు చేయగ లరా? చిన్న రాష్ట్రంగా ఉన్నందువలనే ఛత్తీస్‌గఢ్ ఉగ్రవాదంతో పోరాడగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుందని ఎవరైనా చెప్పగలరా? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల (25.09.2013, ది హిందూ) చేసిన ప్రకటనను గమని ద్దాం. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకోవాలన్న ఉద్దేశమే జార్ఖండ్ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయం. కానీ 13 ఏళ్ల తర్వాత కూడా ఆ ఆశయం నెరవేర లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జార్ఖండ్ ప్రజల స్థితి దుర్భరం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ (25.08.13 ది హిందూ) అభిప్రాయం కూడా ఇలాగే ఉంది. కేంద్రం మీద ఆధారపడకుండా స్వయంసమృద్ధి కలిగి, ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతు న్నట్లు బహుగుణ పేర్కొన్నారు.
 
 యూపీని వదిలి ఏపీని పట్టుకున్నారు
 చిత్రమేమిటంటే ఉత్తరప్రదేశ్‌ను బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమప్రదేశ్‌లుగా విభజించాలని బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు మూజువాణీ ఓటుతో (2011, నవంబర్ 21) ఆమోదించింది. భారత జనాభా ప్రస్తుతం 121,01,93,422. అన్ని రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాలలో 640 జిల్లాలు ఉన్నాయి. ఇందులో యూపీలో 71 జిల్లాలో 19,95,81,477 జనాభా ఉంది. తర్వాతి స్థానం మధ్యప్రదేశ్‌ది. దాదాపు 7 కోట్ల జనాభాతో 50 జిల్లాలు ఉన్నాయి. అయితే బీఎస్పీ తీర్మానాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఎందుకు పూనుకుంది? చిన్న రాష్ట్రాలతో పరిపాలనా సౌలభ్యం ఎక్కువనే వాదన ఇప్పుడు సమంజసమా? సాంకేతిక పరిజ్ఞానంతో దూరభారాలు సడలిపోయాయి.

 

ఈ విషయాన్ని తాజా గా పరిశీలించాల్సిందే. వైశాల్యం అభివృద్ధికి ఆటంకం కాదన్న వాస్తవాన్ని మహా రాష్ట్ర రుజువు చేసింది కూడా. ఇటీవల రఘురామ్ రాజన్ కమిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం గోవా, కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఇవన్నీ చిన్న రాష్ట్రాలు కావడంవల్లనే అభివృద్ధి చెందాయా? ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర చాలా పెద్దది. అయినా అక్కడ విభజన ఊసు లేదు. రఘురామ్ కమిటీ నివేదిక ఒడిశా, బీహార్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్, అసోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్- ఈ పదింటినీ పరిమిత అభివృద్ధికి నోచుకున్న రాష్ట్రాలుగా తేల్చింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్, అసోం, మేఘాలయ సాపేక్షంగా చూస్తే చిన్న రాష్ట్రాలు. అవి అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు?  రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఈ ఏడాది జనవరిలో రిజర్వు బ్యాంకు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయం 2009-10 ఏళ్లలో దాదాపు రూ.45,140 కోట్లు. 2010-11లో 53, 400 కోట్లు. 2011-12లో రూ.66,020 కోట్లకు పెరిగింది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ది మూడవ స్థానం. మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ది నాల్గవ స్థానం. కాబట్టి స్వయం సమృద్ధి కలిగిన ఒక రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం ఎందుకు?
 
 సుప్రీం ముందున్న వ్యాజ్యాల మాటేమిటి?
 చిన్న రాష్ట్రాలతో దేశం భూతల స్వర్గం అయిపోతుందనిచేస్తున్న వాదనలలో నిజమెంత? 1956 నుంచి కూడా రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించి వ్యాజ్యాలు సుప్రీంకోర్టు ముందుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ సరిహ ద్దులకు లేదా జల వివాదాలకు సంబంధించినవి. అమ్మకం పన్ను వసూళ్ల గురించి కూడా కొన్ని గణాంకాలు వెలువడ్డాయి. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి వి.భాస్కరరావు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్ర వార్షిక వాణిజ్య పన్నుల వసూళ్లు 47 వేల కోట్ల రూపాయలు. ఇం దులో కోస్తా జిల్లాలు, రాయలసీమ వాటా 13 వేల కోట్లు (28 శాతం). తెలం గాణ వాటా (హైదరాబాద్, రంగారెడ్డి మినహాయిస్తే) 7 వేల కోట్లు (15 శాతం). ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి వాటా 27 వేల కోట్లు (57 శాతం). హైదరాబాద్, రంగారెడ్డి నుంచి వస్తున్న అమ్మకపు పన్ను వసూళ్లలో 80 శాతం కోస్తా, రాయలసీమ ప్రాంతం వారు చెల్లిస్తున్నవేనన్న వాదన ఉంది. ఈ నేప థ్యంలో హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తుకాదని పెద్దవాదనే నడుస్తోంది. జయ పాల్‌రెడ్డి కూడా హైదరాబాద్ అనేది భారతదేశ ప్రజలందరికీ చెందిందని చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంతం వారు హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చినట్లే తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా వాసులు ముంబై నగరానికి పొట్ట పట్టుకొని వెళ్లారు.

 

అనంతపురం వారు బెంగళూరు నగరానికి, చిత్తూరు జిల్లా వాసులు చెన్నైకి ఉద్యోగాల కోసం వెళ్లారు. చివరిగా ఐటీ పరిశ్రమ గురించి కొన్ని మాటలు. ఈ రంగానికి సంబం దించి ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులతో పాటు మంచి వాతావరణాన్ని కూడా కలిగి ఉందని ఐటీ, ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వి.రాజన్న చెబుతున్నారు. ఇటీవల ఆర్థికవ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ హైదరాబాద్‌ను మొదటిసారిగా ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా ప్రకటించింది. 25 సంవత్సరాలలో రెండు దశలలో పూర్తయ్యే ఈ పథకంలో 1.18 లక్షల కోట్లు సాఫ్ట్‌వేర్‌లోను, 1.01 లక్షల కోట్లు హార్డ్‌వేర్‌లోను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వా మ్యంలో పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బ డిగా పెరగడం ఖాయం. గత ఏడాది రూ.53,246 కోట్లుగా ఉన్న ఐటీ పరిశ్రమ ఆదాయం 2013కు రూ.64,354 కోట్లకు పెరిగింది. ఈ పురోగతి ఇలా కొనసాగ డానికి ఉన్న కారణాలను గమనించాలి. వాటిని పాఠాలుగా స్వీకరించాలి. అది సాధ్యమవుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement