
గ్లాస్గో : స్కాట్లాండ్ తెలుగు సంఘం(టీఏఎస్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి, టీఏఎస్ 15 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ రంజిత్ నాగుబండి మాట్లాడుతూ టీఏస్ నిర్వహిస్తున్న సైక్లింగ్ ప్రాజెక్ట్, స్పోర్ట్స్, పిక్‌నిక్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి సామాజిక కార్యక్రమాలు, వాటిలో వాలంటీర్స్‌లకు ఉన్న అవకాశాలను అందరికి వివరించారు. ఈ సందర్భంగా టీఏఎస్ కార్యవర్గ సభ్యులందరిని సభకు పరిచయం చేశారు. టీఏఎస్ ఛైర్మన్ శ్యామ్ జయంతి, దీపావళి శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలికారు. తెలుగు భాష, సంస్కృతి, సామాజిక స్పూర్తిని ప్రోత్సహించడంలో టీఏఎస్ ప్రాముఖ్యతను తెలిపారు. పదిహేను సంవత్సరాలుగా టీఏఎస్ చేస్తున్న కార్యక్రమాలను అందరికి తెలిపారు.
కల్చరల్ సెక్రటరీ శివ చింపిరి, ఉమెన్స్ సెక్రటరీ తేజ కంటమనేని ఆధ్వర్యంలో జరిగిన నాట్యాలు, పాటల కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కోశాధికారి బెంజిమన్ తెలగాలపుడి, ఐటీ కార్యదర్శి వెంకటేష్ గడ్డం, యూత్ కార్యదర్శి ఉదయ్ కుచాడి, ఈమెంట్ మేనేజ్మెంట్ పనులు, భోజన కార్యక్రమాలు చూసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికి జనరల్ సెక్రటరీ మైథిలి కెంబురి కృతజ్ఞతలు తెలిపారు.





