మైటా ఆధ్వర్యంలో నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్

MYTA meet and greet with Telangana minister Niranjan reddy - Sakshi

కౌలాలంపూర్‌ : మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా మలేషియాలోని వివిధ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి  క్షేత్రాలను, వివిధ రకాల పంటలు సాగు చేసే క్షేత్రాలను సందర్శించి వ్యవసాయంలో మలేషియా వాసులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను తెలుసుకున్నారు. చివరి రోజున మలేషియా కౌలాలంపూర్‌లోని లిటిల్ ఇండియాలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు నిరంజన్‌ రెడ్డితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బిజీ షెడ్యుల్‌లో కూడా తెలంగాణ ప్రవాసులను కలుసుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన నిరంజన్ రెడ్డికి మలేషియా తెలంగాణ ప్రెసిడెంట్ సైదం తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనకు కృషిచేయాల్సిందిగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరపున కోరారు. మైటా గత ఆరు సంవత్సరాలుగా చేసిన ముఖ్య కార్యక్రమాలను, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ చోపరి సత్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, మహిళా విభాగం ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, నిరంజన్ రెడ్డిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అయన అభినందించారు. అలాగే తెలంగాణలో కూడా విదేశాలకు వెళ్లాలని అనుకునే యువతకి అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా మైటాను అయన కోరారు. తెలంగాణ బిడ్డలందరు గర్వపడేటట్లు తెలంగాణ మంత్రులంతా ఉమ్మడి బాధ్యత తీసుకొని కేసీఆర్‌ నాయకత్వాన తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, మారుతీ, చందు, సందీప్, కిరణ్, ప్రతీక్ ,రవితేజ, సందీప్ నరేందర్, సంతోష్, స్వప్న, అశ్విత, సాహితి సాయిచరని, అనూష తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top