కువైట్‌లో రోడ్డుప్రమాదం

Kadapa Person Nagaraj Died in Gulf Kuwait - Sakshi

కారు డిక్కీలో లగేజీ పెడుతుండగా ఢీకొన్న మరో కారు

జీకే రాచపల్లె వాసి మృతి

వైఎస్‌ఆర్‌ జిల్లా, సుండుపల్లె : గల్ఫ్‌ దేశమైన కువైట్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో జి.కె.రాచపల్లెకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సుండుపల్లె మండలం మడితాడు గ్రామ పంచాయతీ జీకే రాచపల్లెకు చెందిన గాదంశెట్టి లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడికి వివాహమై సుండుపల్లె మండలంలో ఆటో నడుపుతూ జీవనం  సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు జి.నాగరాజు (35) జీవనోపాధి కోసం కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి లగేజీని కారు డిక్కీలో పెడుతుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో అక్కడికక్కడే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి నెలలో ఇంటికొచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని తిరిగి వెళ్తానని చెప్పిన కుమారుడు అంతలోనే రోడ్డుప్రమాదంలో మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా నాగరాజు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఆర్థిక వనరుల కోసం బంధువులు  ఇబ్బందులు పడుతున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top