పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్లో చేర్చాలి 

YSRCP MP Vemireddy Prabhakar Reddy Asked The Central Govt To Take Care Of Pinakini Satyagraha Ashram - Sakshi

సాక్షి, ఢిల్లీ: నెల్లూరులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్‌లో చేర్చాలని రాజ్యసభ  జీరో అవర్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. మహాత్మా గాంధీ 1921లో నెలకొల్పిన ఈ ఆశ్రమాన్ని దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలుస్తుంటారని, ఇక్కడి నుంచే అనేక  ఉద్యమాలకు బీజం పడిందని ఆయన గుర్తు చేశారు.

 ఆశ్రమంలోని డిజిటల్ మ్యూజియం సరైన పరికరాలు లేక పని చేయడం లేదన్నారు. పరికరాల కోసం 2.8 కోట్లు,  ఏటా ఖర్చుల కోసం 14 లక్షల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 150వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం, సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విన్నవించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top