భారతీయుడిని అయినందుకు చిరాగ్గా ఉంది! | Yogi Adityanath slams padmavati movie | Sakshi
Sakshi News home page

Nov 21 2017 3:24 PM | Updated on Nov 21 2017 3:28 PM

Yogi Adityanath slams padmavati movie - Sakshi

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ’పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదుపుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు నిషేధించగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇక ’పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో భన్సాలీ, దీపిక తలలు నరికితే.. నజరానా ఇస్తామంటూ ప్రకటనలు వెలువడటంపై ప్రముఖ నటుడు రోహిత్‌ రాయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న అసహనం, అనాగరిక సంస్కృతికి ’తలల నరికివేత’ ప్రకటనలు అద్దం పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక భారతీయుడిగా భారత్‌లో నివసిస్తున్నందుకు తనకు బాధగా, చిరాగ్గా.. ఆవేదనగా ఉందని ఆయన ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఈ సినిమా వివాదంపై మరోసారి స్పందిస్తూ.. భన్సాలీ స్వయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని అన్నారు. భన్సాలీ, దీపిక చంపుతామని బెదిరించిన వారిలాగే భన్సాలీ కూడా నేరస్తుడేనని, ఆయన ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. భన్సాలీగానీ, ఇంకా వేరేవారు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement