 
															టెకీపై ఢిల్లీ  ఐఐఎం ప్రొఫెసర్ నిర్వాకం
													 
										
					
					
					
																							
											
						 టెకీని నమ్మించి మోసం చేసిన  ఓ ఐఐఎం ప్రొఫెసర్ నిర్వాకం వెలుగు చూసింది.
						 
										
					
					
																
	న్యూఢిల్లీ:  టెకీని నమ్మించి మోసం చేసిన  ఓ ఐఐఎం ప్రొఫెసర్ నిర్వాకం వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి  సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేసే ఉద్యోగిని గర్భవతి చేసిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. గుజరాత్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి  ఆమెను లోబరుచుకున్న ఘటన కలకం రేపింది.
	 
	తనపై ఢిల్లీలోని  ఫైప్ స్టార్ హోటల్ లో  ఢిల్లీ కి చెందిన  ఐఐఎం ప్రొఫెసర్ అత్యాచారం చేశాడని  గుర్గావ్ ఐబిఎం లో పనిచేస్తున్న యువతి (21)ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  గుర్గాంలో  పనిచేసే  తనను పెళ్లి చేసుకుంటానని  ప్రొఫెసర్ నమ్మించాడని వాపోయింది.  గుజరాత్ లో ఉద్యోగం  కూడా ఇప్పిస్తానని వాగ్దానం చేశాడని ఆరోపించింది.  అయితే అప్పటికే మరో ప్రొఫసర్ తో  పెళ్లి, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని షాకయ్యానంటోంది.  తనను వంచించిన ప్రొఫెసర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
	 ఢిల్లీ పోలీసులు ప్రొఫెసర్ సహా మరో ఇద్దరిపై  కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు.