ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్‌నాథ్ | Will try to bring nationwide ban on cow slaughter: Rajnath Singh | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్‌నాథ్

Mar 30 2015 2:30 AM | Updated on Sep 2 2017 11:33 PM

ఏకాభిప్రాయం ద్వారా దేశంలో గోవధను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ....

ఇండోర్: ఏకాభిప్రాయం ద్వారా దేశంలో గోవధను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన జైనమత కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనని, అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే గోవధను నిషేధించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. జైనమతం అహింసను పాటిస్తుందని, అది దేశ సంస్కృతిపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. అహింసా మార్గంలో నడిచినప్పుడే ఉగ్రవాదాన్ని ఓడించి, ప్రపంచ శాంతిని సాధించవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement