ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌ను వెనక్కు జరపడంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌ను వెనక్కు జరపడంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ఈ నెల పదో తేదీలోగా బదులివ్వాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నియమావళి అమల్లో ఉన్నందున కేంద్ర బడ్జెట్‌ను వెనక్కి జరిపేలా ఆదేశాలివ్వాలని ప్రతిపక్షాలు ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నసీమ్ జైదీ.. కేంద్ర కేబినెట్ సెక్రటరీ పి.కె.సిన్హాకు శుక్రవారం లేఖ రాశారు.
31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 31న సమావేశం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ, రాజ్యసభలను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.