
'ఆయన విదేశాలకు వెళ్తే.. తిరిగి తీసుకొస్తాం'
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ అసహనం వివాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి
భోపాల్: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ అసహనం వివాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత రాందాస్ అథావాలే స్పందించారు. ఆమిర్ ఒకవేళ విదేశాలకు వెళ్లిపోయినా.. తమ కేడర్‌ను పంపించి ఆయనను తిరిగి భారత్‌కు తీసుకొస్తామని ఆయన తెలిపారు.
దేశంలో ఆయనకు భద్రత అవసరమైతే తమ పార్టీ కేడర్ ఆయనకు రక్షణకవచంగా ఉంటుందని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.