జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో | We don't have any biological samples of Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో

Apr 27 2018 2:34 AM | Updated on Apr 3 2019 4:22 PM

We don't have any biological samples of Jayalalithaa - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత చికిత్సకు సంబంధించిన వైద్య డాక్యుమెంట్లు, రక్త నమూనాలు తమ వద్ద లేవని అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అమృత అనే యువతి జయలలిత కుమార్తెగా రుజువు చేసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

దీంతో జయ రక్తనమూనాలపై బదులివ్వాల్సిందిగా జడ్జి అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ‘ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన నమూనాలను అప్పటికప్పుడే వాడేశాం. ప్రస్తుతం మావద్ద ఏమీ లేవు’ అని గురువారం కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆస్పత్రి వివరణ ఇచ్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement