'బిల్లు ఆమోదంపైనే చర్చించాం' | we discussed on gst bill: arun jaitley | Sakshi
Sakshi News home page

'బిల్లు ఆమోదంపైనే చర్చించాం'

Nov 27 2015 9:23 PM | Updated on Oct 22 2018 9:16 PM

'బిల్లు ఆమోదంపైనే చర్చించాం' - Sakshi

'బిల్లు ఆమోదంపైనే చర్చించాం'

జీఎస్టీ బిల్లు ఆమోదంపైనే ప్రధాని నరేంద్రమోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదంపైనే ప్రధాని నరేంద్రమోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇతర అంశాలు కూడా చర్చించినట్లు తెలిపారు. తొలిసారి మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ప్రధాని మోదీ అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని వివరించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు తమకు మూడు సూచనలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చిస్తుందని, మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement