జయపై పోటీ చేయట్లేదు: కరుణ | we are not contest oppose jaya lalitha say karunanidhi | Sakshi
Sakshi News home page

జయపై పోటీ చేయట్లేదు: కరుణ

May 27 2015 2:58 PM | Updated on Sep 3 2017 2:47 AM

జయపై పోటీ చేయట్లేదు: కరుణ

జయపై పోటీ చేయట్లేదు: కరుణ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సారథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి డీఎంకే తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలిపే ప్రయత్నంలో లేదు.

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పోటీకి డీఎంకే దూరంగా జరిగింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు.  జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి. దాంతో.. ఆమె త్వరలోనే ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తాము తమ అభ్యర్థిని బరిలోకి దించడంలేదని కరుణానిధి ప్రకటించడం గమనార్హం.


అక్కడ పోటీ చేస్తే బాగుండదేమో అని భావించిన డీఎంకే సారథి కరుణానిధి తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో ఉంచబోమని స్పష్టం చేశారు. ఇంకా వేరే పార్టీల అభ్యర్థలు పోటీలో ఉంటారా..  లేదా ? అన్న విషయం తెలియరాలేదు.  కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఖుష్బూ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఏ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో లేకుంటే 'అమ్మ' ఎన్నిక ఏకగ్రీవమే కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement