'బాలుడిని కిడ్నాప్ చేసేందుకు కోతి ప్లాన్‌'

Viral Vedio:  Monkey Riding A Bike Grabs Toddler - Sakshi

ఇటీవల ఓ కోతి సైకిల్‌ తొక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సైకిల్‌పై వచ్చిన ఓ కోతి రెండేళ్ల చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాళ్లోకి వెళితే.. కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న ఓ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సైకిల్‌పై వేగంగా అక్కడికి వచ్చిన ఓ కోతి.. సైకిల్‌ కిందపడేసి చిన్న బాబును తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అత‌ను అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోయాడు. అయినా స‌రే కోతి వ‌దిలిపెట్ట‌లేదు.. మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చి మ‌రీ చిన్నారి దుస్తులను పట్టుకొని కొంత దూరం రోడ్డుపై లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే అక్కడికి రావడంతో కోతి బాలుడిని వదిలేసి పారిపోయింది. (ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. )

కాగా దీనికి సంబంధించిన వీడియోను అమెరికన్‌ బాస్కెట్‌ బాల్‌  మాజీ క్రీడాకారుడు రెక్స్‌ చాప్మన్‌ సోమవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. 16వేల మంది దీనిపై స్పందించారు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కోతి బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ వేసిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. (అందుకోసం ఏడు గంటలు శ్ర‌మించిన హృ‌తిక్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top