ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విజయ్ రూపానీ శనివారం గవర్నర్ ఓపీ కోహ్లిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.
ఈ సందర్భంగా రూపానీ వెంట డిప్యూటీ సీఎంగా ఎన్నిక కానున్న నితిన్ పటేల్, ఇతర నేతలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ రాష్ర్ట ఇన్‌చార్జి దినేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు.