కశ్మీర్‌లో గుండెపోటుతో యాత్రికురాలి మృతి | Vaishno Devi pilgrim dies after heart attack in jammu | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో గుండెపోటుతో యాత్రికురాలి మృతి

Jun 19 2016 7:02 PM | Updated on Sep 4 2017 2:53 AM

జమ్మూలోని పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి ఆలయ గర్భగుడి వద్ద ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.

కశ్మీర్‌: జమ్మూలోని పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి ఆలయ గర్భగుడి వద్ద ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన 45 ఏళ్ల మహిళా యాత్రికురాలు త్రికుటా భవన్‌కు వెళుతూ లంబికేరి ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో అదే దారిలో వెళ్లే కొందరు యాత్రికులు ఆ మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే  అప్పటికే ఆ మహిళ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మహిళ మృతికి కారణం గుండెపోటు లక్షణాలు కనపడుతున్నాయని వైద్యులు తెలిపారు. అనంతరం యాత్రికురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement