తాజ్‌మహల్‌ రత్నం | Uttar Pradesh Chief Minister Yogi Adityanath visits Taj Mahal | Sakshi
Sakshi News home page

తాజ్‌మహల్‌ రత్నం

Oct 27 2017 2:35 AM | Updated on Aug 25 2018 4:19 PM

Uttar Pradesh Chief Minister Yogi Adityanath visits Taj Mahal  - Sakshi

ఆగ్రా: ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన, ఇటీవల వివాదాలు చుట్టుముట్టిన తాజ్‌మహల్‌ను యూపీ సీఎం యోగి  సందర్శించారు. తాజ్‌మహల్‌ను రత్నంగా అభివర్ణించిన యోగి, అక్కడి పరిసరాలను చీపురుకట్టతో ఊడ్చి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. భారత సంస్కృతిలో తాజ్‌ మహల్‌ అంతర్భాగమేననీ యోగి స్పష్టం చేశారు.   ‘తాజ్‌మహల్‌ను ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టారనేదానిపై మనం లోతుగా ఆలోచించకూడదు.

భారతీయ రైతుల, కార్మికుల సంపద, శ్రమతో ఇది నిర్మితమైంది. తాజ్‌ ఒక రత్నం’ అని అన్నారు. యోగి తాజ్‌మహల్‌ లోపల ఉండగానే బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బయట మాట్లాడుతూ శివాలయాన్ని కూలదోసి తాజ్‌మహల్‌ను నిర్మించారనీ, అదే నిజమని మళ్లీ చెప్పుకొచ్చారు. తాజ్‌ను యోగి సందర్శించడంపై సీపీఐ నేత అతుల్‌ అంజన్‌ మాట్లాడుతూ యోగిది ప్రాయశ్చిత్త యాత్ర అని విమర్శిం చారు. కాగా, యోగి తాజ్‌మహల్‌ను సందర్శించిన సమయంలో వేలాది మంది పోలీసులను అక్కడ మొహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement