వైరల్‌ : కొత్త జంట చేతుల్లో ఏకే 56, ఎం 16

Used Guns At Nagaland Rebel Leaders Sons Wedding Reception - Sakshi

కోహిమ : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి. అయితే ఓ పెళ్లిలో వధూవరులు చేసిన పని.. వారికే కాకుండా ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు కూడా  థ్రిల్‌ని పరిచయం చేసింది. పెళ్లి వేడుకలో పూలు, పళ్లు, రకరకాల బహుమతులతో ఫొటోలకు పోజివ్వడం సరిపోదన్నట్టుగా ఓ జంట తుపాకులు చేతబూనారు. ఏకే 56, ఎం16 గన్‌లు పట్టుకుని ఫొటోలు దిగారు. దీంతో అక్కడికొచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాలు.. నాగా వేర్పాటువాద నాయకుడు బహతో కిబా కొడుకు వివాహం దిమాపూర్‌లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో నూతన దంపతులు ఆటోమాటిక్‌ రైఫిల్స్‌ ఏకే 56, ఎమ్‌16లను పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే, తుపాకులు పట్టుకుని ఫొటోలు దిగడమేంటని అక్కడికి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. పబ్లిక్‌లో మారణాయుధాలతో ఫొటోలేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే బహతో కిబాకు విమర్శలపాలడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ జర్నలిస్టులను చంపుతానని బెదిరించి ఆయన పతాక శీర్షికల్లో నిలిచాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top